ITEACHERZ QUICK VIEW

17 March, 2012

చట్టం కాకుండానే పెన్షన్‌ ప్రైవేట్‌పరం - సిహెచ్‌.రవి, యుటియఫ్‌ రాష్ట్ర కార్యదర్శి

పెన్షన్‌ సంస్కరణలకు సంబంధించిన పిఎఫ్‌ఆర్‌డిఎ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందకుండానే పెన్షన్‌ అకౌంట్స్‌ నిర్వహణను ప్రైవేటు ఏజన్సీకి అప్పగించి, నిధులను షేర్‌ మార్కెట్‌కు తరలించేందుకు రంగం సిద్దమైంది. పెన్షన్‌ నిధుల నియంత్రణ, అభివృద్ధి సంస్థ (పిఎఫ్‌ఆర్‌డిఎ)ను ఒక ట్రస్ట్‌గా 2003 ఆగస్ట్‌లో కేంద్ర ప్రభుత్వం నెలకొల్పింది. 2005 లో పెన్షన్‌ సంస్కరణలపై బిల్లును రూపొందించి పార్లమెంటులో ప్రవేశ పెట్టటానికి యుపిఏ-1 ప్రభుత్వం ప్రయత్పించింది. వామపక్షాల అభ్యంతరం, ఉద్యోగ సంఘాల ఆందోళనల ఫలితంగా ఇప్పటి వరకు బిల్లు పార్లమెంటు ముందుకు రాలేదు. కానీ 2004 జనవరి 1 తర్వాత నియమింపబడిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు (రక్షణ శాఖ ఉద్యోగులు మినహా) 2004 సెప్టెంబర్‌ 1 తర్వాత నియామకమైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బలవంతంగా నూతన పెన్షన్‌ విధానం అమలు చేయబడుతున్నది. అంతే కాకుండా 2009 ఏప్రిల్‌1 నుండి దేశ పౌరులందరికీ స్వచ్చందంగా నూతన పెన్షన్‌ పథకంలో చేరేందుకు అవకాశం కల్పించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 

No comments:

Post a Comment

Popular Posts