ITEACHERZ QUICK VIEW

09 January, 2012

ఎంసెట్‌ ప్రవేశ పరీక్ష మే 12న :: ఛైర్మన్‌ జయప్రకాశ్‌ రావు

ఎంసెట్‌ ప్రవేశ పరీక్ష మే 12న జరగనుంది. ఎంసెట్‌ సహా పలు వృత్తి విద్యా కోర్సుల ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. శనివారం ఉన్నత విద్యామండలిలో సమావేశం జరిగింది. వాటి వివరాలను ఛైర్మన్‌ జయప్రకాశ్‌ రావు వెల్లడించారు. ఫిబ్రవరి మొదటి వారంలో ఎంసెట్‌ నోటిఫికేషన్‌ విడుదలవుతుందని, మే 12న పరీక్ష ఉంటుందని తెలిపారు. ఉదయం ఇంజనీరింగ్‌, మధ్యాహ్నం మెడిసిన్‌ పరీక్ష జరుగుతుందన్నారు. ఇక నుంచి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించాలని అనుకున్నామని, ఎంసెట్‌ కమిటీ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. ఎంసెట్‌లో ఎలాంటి మార్పులూ ఉండబోవన్నారు. గతంలో కంటే ఈసారి మెడిసిన్‌కు దరఖాస్తులు పెరిగే అవకాశం ఉందన్నారు. ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ పరీక్షలపై ఎలాంటి గందరగోళమూ లేదని, జాతీయస్థాయిలో మెడిసిన్‌ పరీక్ష నుంచి రాష్ట్రాన్ని కేంద్రం మినహాయించినట్లు తెలిపారు. హైకోర్టు కూడా ఇక్కడ విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఎంసెట్‌లోనే మెడిసిన్‌ పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు.

మిగతా అన్ని పరీక్షల మాదిరిగానే ఎడ్‌సెట్‌ పరీక్షలోనూ ఒక నిమిషం ఆలస్యమైతే పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను అనుమతించబోమన్నారు. కాబోయే టీచర్లు సమయం పాటించాల్సిన అవసరముందని భావించి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. లాసెట్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షల తేదీలను ఈ నెల 12న ప్రకటిస్తామని తెలిపారు. జాతీయ ప్రవేశపరీక్షలు, ఎపిపిఎస్సీ పరీక్షల తేదీలకు ఇబ్బంది లేకుండా తేదీలను ఖరారు చేశామన్నారు. ఈ సమావేశంలో ఉన్నత విద్య ముఖ్యకార్యదర్శి గోపాల్‌, సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్‌ బాలసుబ్రమణ్యం, వివిధ విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్సలర్లు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Popular Posts