ITEACHERZ QUICK VIEW

30 October, 2011

పాఠశాల విద్యలో సంస్కరణలు :: ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో Sat, 29 Oct 2011, IST

పాఠశాల విద్యారంగంలో సంస్కరణలు తేవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో ఒకటి నుంచి పదో తరగతి వరకూ పాఠ్యప్రణాళిక, పాఠ్యాంశాల్లో మార్పులు, చేర్పులు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగానే జాతీయ స్థాయి నిపుణులు, ఉపన్యాసకులు, స్వచ్ఛంద సంఘాల సభ్యులు, విశ్వవిద్యాలయ ఆచార్యులతో సలహా సంఘాన్ని, స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. జాతీయ విద్యా ప్రణాళిక చట్రం-2005, నిర్బంధ ఉచిత విద్యాహక్కు చట్టం-2009, జాతీయ ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక చట్రం-2010 ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్రం (ఎస్‌సిఎఫ్‌)-2011ను రూపొందించింది. 60 ఏళ్ల తర్వాత తొలిసారిగా ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేసి ఈ పాఠ్యాంశాల ప్రణాళికను రూపొందిం చాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. వివిధ సబ్జెక్టులు, సహపాఠ్యాం శాలకు చెందిన 18 అంశాలలో ప్రస్తుత పరిస్థితిని విశ్లేషించి ప్రతిపాదనలతో ఆధారపత్రాలను రూపొందించింది. ఆ 18 ఆధార పత్రాలను రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఈ వెబ్‌సైట్‌ను శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ఎన్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. apscert.org వెబ్‌సైట్‌లో 18 ఆధారపత్రాలు, పాఠ్య ప్రణాళికలు, విద్యా ప్రమాణాలు అందుబాటులో ఉన్నాయి. అనంతరం ప్రాథమిక విద్యాశాఖ మంత్రి ఎస్‌ శైలజానాథ్‌ మీడియాతో మాట్లాడుతూ ప్రజలు, విద్యావేత్తలు, తల్లిదండ్రుల నుంచి అభిప్రాయ సేకరణ ద్వారా పాఠ్యాంశాలను నిర్ణయించడం విద్యారంగంలో ఓ మంచి మార్పును తేవడానికి దోహదపడుతుందని చెప్పారు. నవంబర్‌ 30వ తేదీ వరకూ సలహాలు, సూచనలు స్వీకరిస్తామని తెలిపారు. అభిప్రాయాలను పోస్టు ద్వారా గానీ, ఇ-మెయిల్‌ ద్వారా గానీ ఎస్‌సిఇఆర్‌టి సంచాలకులకు పంపాలని కోరారు. apscert@yahoo.com ద్వారా అభిప్రాయాలు, సూచనలు, సలహాలు పంపాలని తెలిపారు. సంచాలకులు, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ, ఎల్‌బి స్టేడియం దగ్గర, బషీర్‌బాగ్‌, హైదరాబాద్‌-500001 అడ్రస్‌కు పంపాలని సూచించారు. ఈ తరహా కసరత్తు ఆరు దశాబ్దాల తర్వాత జరుగుతోందని అన్నారు. విద్యార్థుల్లో ప్రమాణాలు పెంచడానికే కొత్త పాఠ్య ప్రణాళికలను రూపొందిస్తున్నామని తెలిపారు. సమగ్రమైన విద్యా ప్రణాళిక కోసం పాఠ్య ప్రణాళికను రూపొందిస్తు న్నామని చెప్పారు. తెలుగు మాధ్యమంలోనే ఈ మార్పులుంటాయని అన్నారు. విద్య అనేది విద్యార్థులకు జ్ఞానాన్ని పెంపొందించడానికి దోహదపడాలని సూచించారు. ప్రస్తుత సామాజిక పరిస్థితులకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికను తక్కువ బరువుతో ఎక్కువ విషయ పరిజ్ఞానాన్ని అందించే దిశగా ఫలితాలుంటాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. నిర్దిష్ట కాలపరిమితిలో ఈ పనులను పూర్తిచేయడం ద్వారా రానున్న విద్యా సంవత్సరానికి కొత్త ప్రణాళికను అందుబాటులోకి తెచ్చేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోందన్నారు.
For more Details & Downloads

No comments:

Post a Comment

Popular Posts