ITEACHERZ QUICK VIEW

04 June, 2011

New Guidelines For Teachers :: June 2011 Transfers

టీచర్ల బదిలీలకు కొత్త మార్గదర్శకాలివే..
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: ఉపాధ్యాయుల బదిలీలు, రేషనలైజేషన్‌లో మిగులుగా తేలిన
ఉపాధ్యాయుల సర్దుబాటుకు ప్రభుత్వం కొత్తఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి
కె.జయచంద్రకుమార్ శుక్రవారం న్యూస్‌లైన్‌కు తెలిపారు. తాజా మార్గదర్శకాల ప్రకారం బదిలీ
కోసం దరఖాస్తు చేసిన ఉపాధ్యాయులు రేషనలైజేషన్‌లో బదిలీ అయ్యే ఉపాధ్యాయులకు
ఎన్‌టైటిల్‌మెంట్ పాయింట్లు కేటాయిస్తున్నట్లు ఆయన చెప్పారు.
కొత్త మార్గదర్శకాల ప్రకారం పాయింట్ల కేటాయింపు ఇలా ఉంటుంది...

@ పాఠశాలల్లో మిగులుగా తేలిన ఉపాధ్యాయులు (సర్‌ప్లస్) సర్దుబాటులో వారి బదిలీకి

ఎన్‌టైటిల్‌మెంట్ పాయింట్ల కేటాయింపులో స్పౌజ్, ఫ్రిఫరెన్షియల్ కేటగిరీలు వర్తించవు.
8 సంవత్సరాలు పూర్తయి పాఠశాలల్లో సర్వీస్‌లో జూనియర్ అయి రేషనలైజేషన్‌లో బదిలీ
అవుతుంటే వారికి రేషనలైజేషన్ టీచర్లకు ఇస్తున్న 15 ఎన్‌టైటిల్‌మెంట్ పాయింట్లు కూడా 
రావు.
@ 610 జీఓ అమలులో భాగంగా ఇతర జిల్లాల నుంచి వచ్చి కోర్టు స్టేలో కొనసాగుతున్న
వారిని అవే స్థానాల్లో కొనసాగిస్తారు. 8 సంవత్సరాలు పూర్తయినా వారిని కదిలించేది లేదు.
@
2009లో పదోన్నతి పొందిన వారి విషయంలో రెండోసారి కౌన్సెలింగ్‌లో కొత్త స్థానం కోరుకొని
ఆ పాఠశాలల్లో చేరిన తేదీనే ప్రామాణికంగా తీసుకుంటున్నారు.
@ 610 జీఓలో ఇతర జిల్లాల నుంచి జిల్లాకు వచ్చి ఇతర పోస్టుల్లో పని చేస్తూ జీతం డ్రా చేస్తున్న
టీచర్లను మొదట వారి సబ్జెక్టు ఖాళీలో నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది.
@ పదో తరగతి పరీక్ష ఫలితాలకు సంబంధించి 2010-11 విద్యాసంవత్సరం ఫలితాలనే
ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ప్రధానోపాధ్యాయులకు, పదో తరగతి బోధించిన టీచర్లకు
మొత్తం ఫలితాల ప్రకారమే పాయింట్లు కేటాయిస్తున్నారు.
@ ఎన్‌సీసీ టీచర్లకు 8సంవత్సరాలు పూర్తయినా ఎన్‌సీసీ ఉన్న పాఠశాలల్లో ఖాళీ లేకపోతే వారిని
ప్రస్తుతం పని చేస్తున్న పాఠశాలల్లోనే కొనసాగిస్తారు.
@ రిటైర్మెంట్ రెండు సంవత్సరాల్లోపు ఉండి పాఠశాలల్లో మిగులుగా తేలిన ఉపాధ్యాయులను
సైతం బదిలీ చేయూలనే ఆదేశాలున్నారుు
@ మెడికల్ సర్టిఫికెట్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పాయింట్లు కేటాయిస్తారు.

No comments:

Post a Comment

Popular Posts